ETV Bharat / state

అయోధ్య నిధి కోసం జనజాగరణ కరపత్రికల విడుదల

అయోధ్య నిర్మాణం కోసం నిధి సమర్పణ జనజాగరణ కార్యక్రమాన్ని విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ కార్యకర్తలు, నాయకులుప్రారంభించారు. దానికి సంబంధించిన కరపత్రికలని వారు విడుదల చేశారు.

Release of Janajagaran pamphlets for Ayodhya construction
అయోధ్య నిర్మాణం కోసం జనజాగరణ కరపత్రికల విడుదల
author img

By

Published : Jan 20, 2021, 4:27 PM IST

అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం కోసం నిధి సమర్పణ జనజాగరణ కార్యక్రమాన్ని విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ కార్యకర్తలు కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్ జనజాగరణ కరపత్రికని యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి కొండ కింది ఉన్న హనుమాన్​ గుడి ప్రాంగణంలో విడుదల చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామమందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని వారు కోరారు. ప్రజలు తోచినంత విరాళం ఇచ్చి ఆలయ నిర్మాణంలో పాలు పంచుకోవాలన్నారు. అనంతరం యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డిని కలిసి నిధి సమర్పణ గురించి వివరించారు.

ఇదీ చూడండి: గొంతుతో రకరకాల బీట్లు.. వింటే ఔరా అనాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.