యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన.. వలయ రహదారి విస్తరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వైకుంఠ ద్వారం సమీపంలోని పురాతన ఆంజనేయ స్వామి స్వాగత తోరణాన్ని తొలగించి.. దాని స్థానంలో కొత్తది ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే అండర్ పాస్ నిర్మాణ పనులను వేగవంతం చేశారు.
వైటీడీఏ అధికారులు.. ఆలయానికి వెనుక నుంచి చేరుకునే రహదారిని ఇప్పటికే నిర్మించారు. ముందు భాగంలో రోడ్డు పనులకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. నివాస గృహాలు తొలగించిన స్థలంలో మట్టి పోసి రోడ్డును చదును చేస్తున్నారు.
ఇదీ చదవండి: 18-44 ఏళ్ల మధ్య వారికి 3.5 కోట్ల టీకాలు కావాలి: ఈటల