ETV Bharat / state

కిసాస్ సంఘర్ష్ సంఘ్ ర్యాలీ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు - telangana news

ఆల్ ఇండియా కిసాస్ సంఘర్ష్ సంఘ్.. రైతులకు మద్దతుగా తలపెట్టిన ర్యాలీ నేపథ్యంలో పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు మధ్యహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకూ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించారు. వాహనదారులు సహకరించాలని కోరారు.

rachakonda-traffic-police-have-imposed-several-traffic-restrictions
కిసాస్ సంఘర్ష్ సంఘ్ ర్యాలీ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
author img

By

Published : Jan 25, 2021, 10:46 PM IST

రైతులకు మద్దతుగా ఆల్ ఇండియా కిసాస్ సంఘర్ష్ సంఘ్.. మంగళవారం తలపెట్టిన ర్యాలీ దృష్ట్యా రాచకొండ ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ర్యాలీ సమయంలో ఎల్బీనగర్ కూడలి నుంచి ఉప్పల్ క్రాస్ రోడ్ వరకు రహదారిపై వాహనాలను నిషేధించారు.

ముఖ్య సూచనలు..

విజయవాడ, వరంగల్ నుంచి వచ్చే వాహనదారులు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఓఆర్ఆర్ మీదుగా వెళ్లాలని సూచించారు. హైదరాబాద్ నుంచి వరంగల్, విజయవాడ వెళ్లే వారు సరూర్​నగర్, ఉప్పల్ వైపు రాకుండా.. ఓఆర్ఆర్ కానీ.. ప్రత్యామ్నాయ రహదారుల్లో కానీ వెళ్లాలని కోరారు.

సాయంత్రం వరకు అమలు..

ఓఆర్ఆర్ కాకుండా సాధారణ రహదారిలో వచ్చే వాహనదారులు ఉప్పల్ స్టేడియం, సరూర్ నగర్ స్టేడియం, హుడా కాంప్లెక్స్, కామినేని, అల్కాపురి, నాగోల్, ఉప్పల్ క్రాస్ రోడ్ల వైపు రావొద్దని పోలీసులు వెల్లడించారు. రేపు మధ్యహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.

ఇదీ చూడండి: గణతంత్ర వేడుకలకు మొబైల్‌ యాప్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.