ETV Bharat / state

200 మంది గిరిజనులకు నిత్యావసరాలు పంపిణీ - రాచకొండ తాజా వార్తలు

యాదాద్రి జిల్లా రాచకొండ పరిధిలోని తండాలకు చెందిన 200 మంది గిరిజనులకు ఇన్ఫోసిస్​ ఆధ్వర్యంలో సీపీ మహేశ్​ భగవత్​ నిత్యావసరాలు పంపిణీ చేశారు. రాచకొండ గ్రామాన్ని పోలీసులు దత్తత తీసుకోవడం, రోడ్ల నిర్మాణం చేపట్టడం వంటి పనులను ప్రశంసించారు. ఛత్తీస్​గఢ్​కు చెందిన 20 మంది వలస కూలీలకు బస్సు ఏర్పాటు చేసి వారి స్వస్థలాలకు చేరవేశారు.

200 మంది గిరిజనులకు నిత్యావసరాలు పంపిణీ
200 మంది గిరిజనులకు నిత్యావసరాలు పంపిణీ
author img

By

Published : May 18, 2020, 10:33 PM IST

యాదాద్రి జిల్లా రాచకొండను పాలించిన రాజుల చరిత్ర గురించి తెలియజెప్పే రాచకొండ కోటను సీపీ మహేశ్​ భగవత్​ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఇన్ఫోసిస్​ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం 200 మంది గిరిజనులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. 2016లో రాచకొండ గ్రామాన్ని పోలీసులు దత్తత తీసుకొని.. రోడ్ల నిర్మాణం, వైద్య శిబిరాల వంటి ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారి సేవలను సీపీ మహేశ భగవత్​ కొనియాడారు.

ఛత్తీస్​గఢ్​లోని సూక్మ జిల్లాకు చెందిన 20 మంది వలస కూలీలు హైదరాబాద్​ నిజాంపేట నుంచి కాలి నడకన బయలుదేరారు. వారికి చౌటుప్పల్​లో సీపీ మహేశ్​ భగవత్​ ఆహారం, నీరు ఏర్పాటు చేశారు. అనంతరం వారి రాష్ట్రానికి తరలించేలా బస్​ కూడా ఏర్పాటు చేశారు.

ఇవీ చూడండి:'యురేనియం తవ్వకాలపై కేసీఆర్​ స్పష్టత ఇవ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.