ETV Bharat / state

Mahesh bhagavath: పోలీసులకు మాస్కులు అందజేసిన రాచకొండ సీపీ - rachakonda cp mahesh bhagavath distributed masks

యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్ ప్లాజా వద్ద ఉన్న చెక్ పోస్టును రాచకొండ సీపీ మహేష్ భగవత్ సందర్శించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు అందజేశారు.

rachakonda cp mahesh bhagavath visited guduru check post
పోలీసులకు మాస్కులు అందజేసిన రాచకొండ సీపీ
author img

By

Published : May 28, 2021, 5:14 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ సందర్శించారు.‌ చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వాహన తనిఖీల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సిబ్బందికి వివరించారు. అనంతరం వారికి శానిటైజర్లు, మాస్కులు అందజేశారు. వాహనదారులను తనిఖీ చేసి వారి వద్ద ఉన్న ఈ - పాసులను పరిశీలించారు.

ఎట్టి పరిస్థితుల్లో ఈ-పాసులు లేని వాహనాలను అనుమతించబోమని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.‌ ప్రజలు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. కార్యక్రమంలో భువనగిరి జోన్ డీసీపీ కె. నారాయణ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ శంకర్, భువనగిరి రూరల్ సీఐ జానయ్య, బీబీనగర్ ఎస్ఐ రాఘవేందర్ ఉన్నారు.‌

ఇదీ చదవండి : Lockdown Effect: ఆర్థిక సుడిగుండంలో కూరగాయల రైతు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.