యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని బసంతపురం గ్రామంలో యక్షగానం కళారూపంతో కరోనాపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. యముడు, చిత్రగుప్తుడు, యమభటులు పాత్ర వేషధారణలతో పిల్లిట్ల ముకుందం బృదం ప్రదర్శన నిర్వహించారు. కరోనా వైరస్ మహమ్మారి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను, సూచనలను గ్రామస్థులకు వివరించారు. గ్రామ ప్రజలు ఎవరైనా ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని తెలిపారు. అనంతరం వారికి స్థానిక తహసీల్దార్ నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.
యమధర్మరాజు అవతారంలో... కరోనాపై అవగాహన - యక్షగానం కళారూపం
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు ప్రాణాంతకమైన కరోనాపై అవగాహన కల్పించడానికి జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టారు. జిల్లాలోని బసంతపురం గ్రామంలోని ప్రజలకు యక్షగానం కళకారులతో అవగాహన కల్పించారు.