యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఉత్తరప్రదేశ్ హాథ్రస్ ఘటన దళిత యువతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండగొని రామచంద్రు గౌడ్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాలిపెద్ది మల్లారెడ్డి, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పురుగుల నర్సింహా యాదవ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు అవిశెట్టి అవిలిమల్లు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మందుల సురేష్, జిల్లా కాంగ్రెస్ నాయకురాలు అన్నేపు పద్మనర్సింహ, గంజి మంగ, గుండుశ్రీను, అవిశెట్టి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.