యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కేర్చ్పల్లి గ్రామంలోని కిరాణా దుకాణంలో అక్రమంగా గుట్కా, పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న వ్యక్తిని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పంతంగి శ్రీనివాస్గా వెల్లడించారు. కిరాణా షాపులో మొత్తం రూ.61,798 విలువ గల గుట్కా, పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు.
ఇవీచూడండి: ఖమ్మంలో లారీ ఢీకొని ఇద్దరు మృతి