ETV Bharat / state

వాసాలమర్రి దళితవాడల్లో ప్రొఫెసర్ల బృందం పర్యటన... ఎందుకంటే..

ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలోని దళితవాడల్లో ప్రొఫెసర్ల బృందం పర్యటించింది. దళితబంధు పథకంపై బృందం సభ్యులు అధ్యయనం చేశారు.

vasalamarri
vasalamarri
author img

By

Published : Oct 3, 2021, 9:58 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలోని దళితవాడల్లో ప్రొఫెసర్ల బృందం పర్యటించింది. సీఎం కేసీఆర్​ దత్తత గ్రామంలో... దళిత బంధు పథకంపై బృందం సభ్యులు అధ్యయనం చేశారు. వాసాలమర్రి గ్రామంలోని దళిత వాడల్లో ఇంటింటికి తిరుగుతూ దళితులను కలిసి దళిత బంధు పథకం తెచ్చిన గుణాత్మక మార్పును అధ్యయనం చేశారు. వాసాలమర్రి దళితులను... దళిత బంధును ఎలా విజయవంతం చేస్తున్నారు? ఏ వృత్తులను ఎంచుకున్నారు? ఆత్మవిశ్వాసం ఎలా పెరిగింది? స్వావలంభన దిశగా ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు? ఎంచుకున్న వృత్తుల్లో ఏ మేరకు నైపుణ్యాలను మెరుగు పర్చుకున్నారు...ఇలా అనేక అంశాలపై ప్రొఫెసర్ల బృందం అధ్యయనం చేశారు.

కాలనీవాసులతో భేటీ అయిన ప్రొఫెసర్ల బృందం
కాలనీవాసులతో భేటీ అయిన ప్రొఫెసర్ల బృందం

కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ల బృందంతో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, కవి, రచయిత, జూలూరి గౌరీ శంకర్, ప్రముఖ చరిత్రకారుడు అడపా సత్యనారాయణ, ఎస్‌ఆర్‌టీఐ డైరెక్టర్ కిశోర్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జె.దేవి ప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యామ్ సుందర్, సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ నవీన్, ఎంజీ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ అంజిరెడ్డి, వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు ఉన్నారు.

దళితవాడల్లో పర్యటించిన ప్రొఫెసర్ల బృందం
దళితవాడల్లో పర్యటించిన ప్రొఫెసర్ల బృందం

ఇదీ చూడండి: Rajagopal Reddy: మునుగోడులో అమలు చేస్తే రాజీనామా చేస్తా: రాజగోపాల్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.