ETV Bharat / state

Yadadri: యాదాద్రి కొండపైకి ప్రైవేటు వాహనాలు నిషేధం.. ఉచితంగా భక్తుల తరలింపు

yadadri
యాదాద్రి కొండపైకి ప్రైవేటు వాహనాలు నిషేధం
author img

By

Published : Mar 31, 2022, 5:54 PM IST

Updated : Mar 31, 2022, 6:28 PM IST

17:51 March 31

Yadadri: యాదాద్రి కొండపైకి ప్రైవేటు వాహనాలు నిషేధం.. ఉచితంగా భక్తుల తరలింపు

Yadadri: యాదాద్రి కొండపైకి ప్రైవేటు వాహనాలపై యాదాద్రి దేవస్థానం నిషేధం విధించింది. కొండపైకి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తరలించునున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి వెల్లడించారు. రేపట్నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా కొండపైకి భక్తుల తరలించనున్నట్లు తెలిపారు. భక్తుల తరలింపునకు అయ్యే వ్యయం ఆలయమే భరిస్తుందని ఈవో స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో భక్తులకు వ్యయభారం తగ్గుతుందని ఈవో పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

త్వరలోనే సేవలు ప్రారంభం...

యాదాద్రిలో త్వరలోనే స్వామివారి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, శాశ్వత కల్యాణ సేవలు ప్రారంభిస్తామని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. త్వరలో శాశ్వత బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, మొక్కు జోడు సేవలు ప్రారంభమవుతాయని గీతారెడ్డి వెల్లడించారు.

స్వామివారి నిత్య కైంకర్యాల వేళలు

  • ఉదయం 4నుంచి 4.30 వరకు సుప్రభాతం
  • ఉదయం 4.30 నుంచి 5 వరకు బిందె తీర్థం, ఆరాధన
  • ఉదయం 5 నుంచి 5.30 వరకు బాలభోగం
  • ఉదయం 5.30 నుంచి 6 వరకు పుష్పాలంకరణ సేవ
  • ఉదయం 6నుంచి 7.30 వరకు సర్వదర్శనం
  • ఉదయం 7.30 నుంచి 8.30 వరకు నిజాభిషేకం
  • ఉదయం 8.30 నుంచి 9 వరకు సహస్రనామార్చన
  • ఉదయం 9 నుంచి 10 వరకు బ్రేక్ దర్శనం
  • ఉదయం 10 నుంచి 11.45 వరకు సర్వదర్శనం
  • ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు రాజభోగం (ఆరగింపు)
  • యాదాద్రి: మ. 12.30 నుంచి 3 వరకు సర్వదర్శనాలు
  • యాదాద్రి: మ.3 నుంచి సా.4 వరకు ఆలయం మూసివేత
  • యాదాద్రి: సాయంత్రం 4 నుంచి 5 వరకు బ్రేక్‌ దర్శనం
  • యాదాద్రి: సాయంత్రం 5 నుంచి రాత్రి 7 వరకు సర్వదర్శనం
  • యాదాద్రి: రాత్రి 7 నుంచి 7.45 వరకు తిరువారాధన సేవ
  • యాదాద్రి: రాత్రి 7.45 నుంచి 8.15 వరకు సహస్రనామార్చన, కుంకుమార్చన
  • యాదాద్రి: రాత్రి 8.15 నుంచి 9 వరకు సర్వదర్శనం
  • యాదాద్రి: రాత్రి 9 నుంచి 9.30 వరకు రాత్రి నివేదన (ఆరగింపు)
  • యాదాద్రి: రాత్రి 9 నుంచి 9.45 వరకు శయనోత్సవం
  • యాదాద్రి: రాత్రి 9.45 గం.కు ద్వారబంధనం (ఆలయం మూసివేత)

ఇదీ చూడండి:

Yadadri Development: 'తిరుమల తరహాలో యాదాద్రిలో వసతులు

Last Updated : Mar 31, 2022, 6:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.