కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో లాక్ డౌన్ కొనసాగుతోంది. కర్ఫ్యూ విధించినా.. నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపై తిరుగుతున్న వాహనదారులను పోలీసులు హెచ్చరించారు. ఎస్సై గుండెల రాజు.. వారితో గుంజీలు తీయించి.. అత్యవసర సేవలకు మాత్రమే రోడ్డుపైకి రావాలని సూచించారు. అలాగే కొందరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని పోలీసులు కోరారు.
రోడ్లపై యువత సంచారం.. గుంజీలు తీయించిన పోలీసులు - యాదగిరిగుట్టలో గుంజీలు తీయించిన పోలీసులు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. అయినా కొంతమంది యువత నిర్లక్ష్యంగా రోడ్లపై తిరుగుతున్నారు. అలా అనవసరంగా బయటకొచ్చిన వాహనదారులను యాదగిరిగుట్ట ఎస్సై రాజు గుంజీలు తీయించారు.
రోడ్లపై యువత సంచారం.. గుంజీలు తీయించిన పోలీసులు
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో లాక్ డౌన్ కొనసాగుతోంది. కర్ఫ్యూ విధించినా.. నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపై తిరుగుతున్న వాహనదారులను పోలీసులు హెచ్చరించారు. ఎస్సై గుండెల రాజు.. వారితో గుంజీలు తీయించి.. అత్యవసర సేవలకు మాత్రమే రోడ్డుపైకి రావాలని సూచించారు. అలాగే కొందరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని పోలీసులు కోరారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందలేదు: ఈటల