యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల పరిధిలోని పొడిచేడులో అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం వల్ల గ్రామంలో 14 రోజుల పాటు స్వచ్ఛంద లాక్డౌన్ విధించుకున్నారు. కరోనా బాధితులు నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడొద్దననే ఉద్దేశంతో గ్రామ సర్పంచ్ పేలపూడి మధు సొంత డబ్బుతో పాలు, పండ్లు, కూరగాయలు, పప్పు, బియ్యం, శానిటైజర్ వంటివి పంపీణీ చేశారు.
గ్రామంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న కారణంగా లాక్డౌన్ విధించామని ప్రతి ఒక్కరు మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని సర్పంచ్ సూచించారు. కొవిడ్ బాధితులు ఆత్మస్తైర్యం కోల్పోవద్దని... మనోధైర్యంతో కరోనాను జయించాలని అన్నారు. గ్రామ ప్రజలందరూ లాక్డౌన్కు సహకరించాలని సర్పంచ్ మధు కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు సుగుణమ్మ, జిట్ట వీరమ్మ, కానిస్టేబుల్ శంకర్, ఆశా వర్కర్లు జిట్ట వాణి, రజిత, విఆర్ఏలు అంబటి బలరాములు, ఎల్లేష్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: PRC: ఉద్యోగులకు గుడ్న్యూస్... అమల్లోకి రానున్న పీఆర్‌సీ!!