ETV Bharat / state

pedal loom machine: నేతన్నల కాళ్లకు పని తగ్గించే పెడల్​ యంత్రం.. - పల్లె సృజన సంస్థ

pedal loom machine : ఏ కాలంలో అయిన ధరించేందుకు అనుకూలమైన వస్త్రాలు అని చెప్పగానే గుర్తొచ్చేది చేనేత వస్త్రాలనే చెప్పాలి. చూసేందుకు ఎంతో అందంగా.. ధరించడానికి సౌకర్యంగా ఉండే ఈ వస్త్రాల తయారీ వెనుక ఎంతో శ్రమ ఉంటుంది. మగ్గంలో నాడిని అటు ఇటు కదిలించాలంటే చేనేత కార్మికులు నవ నాడులు కదిలించాల్సిందే. రోజుల తరబడి కాళ్లు, చేతులు ఆడిస్తేనే ఓ చీర తయారవుతుంది. ఈ క్రమంలో చేనేత కార్మికుల కష్టానికి పరిష్కారాన్ని చూపిస్తూ.. శివకుమార్​ అనే వ్యక్తి రూపొందించిన పెడల్​ ఆపరేటింగ్​ యంత్రం నేతన్నల కష్టాన్ని తేలిక చేసింది. దివ్యాంగులు, మహిళలు, వృద్ధులు కూడా ఈ యంత్రంలో వస్త్రాలు సులభంగా నేయవచ్చు. ఇంతకీ ఈ యంత్రం విశేషాలు ఏమిటో తెలుసుకుందాం..

Handloom
Handloom
author img

By

Published : Feb 6, 2022, 4:41 PM IST

Updated : Feb 6, 2022, 7:16 PM IST

నేతన్నల కాళ్లకు పని తగ్గించే పెడల్​ యంత్రం..

pedal loom machine : చేనేత కార్మికుల శ్రమ భారాన్ని తగ్గించడానికి మగ్గాల్లో అనేక మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆసు యంత్రం చేనేత రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆస్ఫూర్తితో హైదరాబాద్​కి చెందిన శివకుమార్ అనే యువకుడు పెడల్ ఆపరేటింగ్ యంత్రాన్ని రూపొందించాడు. దీనివల్ల చేనేత కార్మికుల శ్రమ భారం తగ్గి, ఉత్పత్తి పెరుగుతుంది. సాధారణ మగ్గంపై రోజుకు 10 గంటల చొప్పున 6 రోజులు మగ్గం నేస్తే చీర తయారవుతుంది. అదే సాధారణ మగ్గానికి పెడల్ ఆపరేటింగ్ యంత్రం అమర్చితే రోజుకు 8 గంటలు పనిచేసి నాలుగు రోజుల్లోనే చీరను తయారు చేయొచ్చు.

ఇది ఎలా పనిచేస్తుంది..

పెడల్ ఆపరేటింగ్ యంత్రంలో 0.25 హెచ్​పీ మోటార్ ఉంటుంది. దీన్ని సాధారణ మగ్గానికి అమర్చవచ్చు. మగ్గం నేసే వారు కాళ్లతో పెడల్​ని తొక్కనవసరం లేకుండానే కరెంటు సాయంతో పెడల్ కిందికి పైకి మారుతూ పింజర, పేట్​తో పాటు అచ్చులను ఒకే సారి లాగొచ్చు. కరెంటు లేనప్పుడు కూడా పనికి అంతరాయం లేకుండా మిషన్​కు అమర్చిన చెక్క పెడల్ తో సాధారణ మగ్గం లాగా పనిచేసుకోవచ్చు. మగ్గం నేయటానికి మాములుగా లయబద్ధంగా పెడల్​ను తొక్కాల్సి వస్తుంది. దీంతో వృద్ధులు, మహిళలు మోకాళ్లు, కీళ్ల నొప్పుల భారిన పడుతుంటారు. ఈ యంత్రం వల్ల వారి ఇబ్బందులకు పరిష్కారము లభిస్తుంది. ముఖ్యంగా వికలాంగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఎవరు రూపొందించారు..

హైదరాబాద్​కు చెందిన శివ కుమార్ అనే యువకుడు... పల్లె సృజన సంస్థ సహకారంతో జకాత్ మగ్గాలకు అవసరమైన పెడల్ ఆపరేటింగ్ యంత్రాన్ని రూపొందించాడు. దీని గురించి యూట్యూబ్​లో అప్లోడ్​ చేశాడు. దాన్ని చూసిన పోచంపల్లి చేనేత కార్మికులు... సాధారణ మగ్గానికి కూడా యంత్రాన్ని రూపొందించాలని కోరారు. వారి విజ్ఞప్తిపై ఇటీవల పెడల్ ఆపరేటింగ్ యంత్రం తయారు చేశారు. దీన్ని మొదటిసారి పోచంపల్లి పట్టణానికి చెందిన దివ్యాంగుడు గొట్టిముక్కుల రమేశ్​ మగ్గానికి అమర్చారు. గత వారం పది రోజులుగా రమేశ్​... మగ్గంపై యంత్రం ద్వారా విజయవంతంగా చీర నేస్తున్నాడు. దివ్యాంగుడైన రమేశ్​.. ఇప్పటి వరకు ఓ స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన కృత్రిమ కాళ్ల సాయంతో మగ్గం నేసేవాడు. ఇప్పుడు పెడల్​ యంత్రం రావడంతో సులభంగా మగ్గం నేస్తున్నాడు. ఈ యంత్రం సహకారంతో తన కష్టానికి ఓ పరిష్కారం లభించిందని రమేశ్​ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

పదేళ్ల క్రితం రైలు ప్రమాదంలో రెండు కాళ్లూ కోల్పోయాను. ఆ తర్వాత ఓ స్వచ్ఛంద సంస్థ సహాకారంతో కృత్రిమకాళ్లు పెట్టించుకున్నాను. వాటితోనే నేత నేసేవాడిని. అయినప్పటికీ నొప్పి వస్తూనే ఉండేది. కానీ ఈ యంత్రం సహాయంతో ఎలాంటి కష్టం లేకుండా చాలా సులభంగా నేత నేస్తున్నాను. పైగా చాలా తక్కువ రోజుల్లోనే చీర నేస్తున్నాను. నాలాంటి దివ్యాంగులతో పాటు, మహిళలు, వృద్ధులకు ఇది ఎంతో ఉపయోగకరం. ఈయంత్రాన్ని కనిపెట్టిన శివకుమార్​గారికి ధన్యవాదాలు. -రమేశ్​, చేనేత కార్మికుడు

కష్టం లేకుండా చేస్తుంది..

ఈ యంత్రం వల్ల కార్మికులు శ్రమ తగ్గి ఉత్పత్తి పెరుగుతుందని, దివ్యాంగులు, వృద్ధులు మహిళలు చాలా సులభంగా ఈ యంత్రం సాయంతో చేనేత పని చేసుకోవచ్చని యంత్రాన్ని రూపొందించిన మోదా టెక్నాలజీస్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ ప్రవీణ్ తెలిపారు.

చేనేత కార్మికుడు చీర నేసే క్రమంలో రోజుకు వందల సార్లు పెడల్​ని తొక్కాల్సి వస్తుంది. దీనివల్ల శ్రమ, అలసట, కాళ్లు నొప్పులతో బాధపడేవారు. కానీ పెడల్ ఆపరేటింగ్ యంత్రం ద్వారా మగ్గంపై షటిల్ సులువుగా తిరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చీటికీ నేత, సాదా నేత, వరుస నేతలను ఎలాంటి శ్రమ లేకుండానే నేయవచ్చు. సాధారణ మగ్గానికి ఎలాంటి మార్పులు చేయుకుండానే పెడల్ ఆపరేటింగ్ యంత్రాన్ని అమర్చుకోవచ్చు.. -ప్రవీణ్, మోదా టెక్నాలజీస్​ కంపెనీ మార్కెటింగ్​ మేనేజర్​

చాలా ఉపయోగకరం..

ఈ యంత్రం వల్ల మహిళలకు, వృద్ధులకు చాలా ఉపయోగకరంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిని ప్రభుత్వం ఉచితంగా అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మా కుమారుడు కృత్రిమ కాళ్లతో నేత నేసేందుకు ఇబ్బందిపడేవాడు. ఈ యంత్రం పెట్టుకున్నాక చాలా సులభంగా కష్టం లేకుండా తక్కువ రోజుల్లోనే చీర నేస్తున్నాడు. చాలా సంతోషంగా ఉంది. ఆండాలు, రమేశ్​ తల్లి

మహిళలకు ఈ యంత్రం చాలా అవసరం. నేతతో పాటు ఇంట్లో పనులు, పిల్లలను చక్కబెట్టుకోవడం వల్ల శారీరకంగా అలసిపోతారు. అదే సమయంలో మగ్గంపై పనిచేయడంవల్ల ఇబ్బందిగా ఉంటుంది. ఈ యంత్రం పెట్టుకుంటే పెద్దగా అలుపు అనిపించదు. ప్రభుత్వం ఈ యంత్రాన్ని ఉచితంగా అందించాలి. -బాలమణి, చేనేత కార్మికురాలు

సులభ వాయిదాల్లో పొందండి..

ఈ యంత్రం ధర రూ.11,000గా ఉంది. అయితే ఈ యంత్రం కావాల్సిన వారికి స్థానిక పోచంపల్లి అర్బన్ బ్యాంకు రుణసదుపాయం కల్పిస్తున్నారు. చేనేత కార్మికులు రూ.1000 డౌన్ పేమెంట్ చెల్లిస్తే చాలు, మిగిలిన మొత్తాన్ని బ్యాంకు వారు రుణంగా అందిస్తారు. ఆ రుణాన్ని 12 నెల సరి వాయిదాల్లో చెల్లిచే సదుపాయాన్ని కల్పించినట్లు పోచంపల్లి అర్బన్ బ్యాంక్ మేనేజర్ మధు తెలిపారు. వడ్డీ కూడా ఇతర రుణాల వడ్డీతో పోల్చితే చాలా తక్కువ అని, తమ బ్యాంక్​లో ఖాతా ఉన్న చేనేత కార్మికులకు యంత్రం కొనుగోలుకు రుణ సదుపాయం కల్పించామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ప్రత్యామ్నాయం వేసినా అదే గోస.. దిక్కుతోచని స్థితిలో రైతులు

Last Updated : Feb 6, 2022, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.