ETV Bharat / state

యాదాద్రి ఆలయ ఆర్కిటెక్ట్​ని అభినందించిన పవన్ కల్యాణ్ - janasena precident pavan kalyan latest

ధార్మిక రత్మ పురస్కారం వరించిన సందర్భంగా యాదాద్రి ఆలయ ఆర్కిటెక్ట్​ ఆనంద్​సాయిని జనసేన అధ్యక్షుడు పవన్​ కల్యాణ్​ అభినందించారు. హైదరాబాద్​లోని తన కార్యాలయంలో శాలువాతో సత్కరించారు.

pavan kalyan appriciated anand sai on behalf of dharmika ratna award
యాదాద్రి ఆలయ ఆర్కిటెక్ట్​ని అభినందించిన పవన్ కల్యాణ్
author img

By

Published : Oct 17, 2020, 5:47 AM IST

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ నిర్మాణంలో ఎంతో నిష్ఠతో పాలుపంచుకోవడం ప్రశంసనీయమని యాదాద్రి ఆలయ ఆర్కిటెక్ట్​ ఆనంద్​సాయిని జనసేన అధ్యక్షుడు పవన్​ కల్యాణ్​ ప్రశంసించారు. ఆలయ నిర్మాణం, సంబంధిత వాస్తు అంశాలపై ఎంతో పరిశోధన చేసిన ఆయనకు ధార్మిక రత్న పురస్కారం దక్కడం సముచితమని పేర్కొన్నారు. హైదరాబాద్​లోని తన కార్యాలయంలో ఆనంద సాయిని శాలువాతో సత్కరించారు.

ఇటీవల హైదరాబాద్ బిర్లా ఆడిటోరియంలో శ్రీ శాంతికృష్ణ సేవా సమితి నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్​రెడ్డి చేతుల మీదుగా యాదాద్రి ఆలయ ముఖ్య ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి ‘ధార్మిక రత్న’ పురస్కారం స్వీకరించారు.

ఇదీ చూడండి: కాల్ సెంటర్​ స్కామ్​లో రూ.190 కోట్లు సీజ్: సీబీఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.