ETV Bharat / state

వైభవంగా యాదాద్రి పాతగుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. 15న రథోత్సవం - yadadri pathagutta brahmotsavalu 2022

Yadadri Patha Gutta Brahmotsavalu: యాదాద్రి పాతగుట్ట నారసింహుని బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్చారణల మధ్య బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టిన ఆలయ అర్చకులు.. స్వామి, అమ్మవార్లను కన్నుల పండువగా అలంకరించారు. ఈ నెల 15 న స్వామి వారి రథోత్సవం జరగనుంది.

yadadri pathagutta brahmotsavalu
యాదాద్రి పాతగుట్ట బ్రహ్మోత్సవాలు
author img

By

Published : Feb 11, 2022, 5:31 PM IST

Yadadri Patha Gutta Brahmotsavalu: యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు స్వస్తివాచనంతో బ్రహ్మోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు. వేదమంత్రోచ్చారణల నడుమ, సన్నాయి మేళాల హోరులో.. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ప్రత్యేక పూజలతో ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ముందుగా పవిత్ర జలంతో ఆలయ పరిసరాలను సంప్రోక్షణ చేసిన అనంతరం లక్ష్మీ సమేత నారసింహులకు రక్షాబంధనం గావించారు. అనంతరం వేదపండితుల పారాయణాల మధ్య, సన్నాయి వాయిద్యాల హోరులో పుణ్యాహవాచనం తంతును వైభవంగా నిర్వహించారు.

కనువిందుగా అలంకరణ

బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా తెప్పించిన పూలతో.. స్వామి అమ్మవార్లను అర్చకులు అలంకరించారు. వజ్రవైఢూర్యాలు, ముత్యాల హారాలు, బంగారు ఆభరణాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు.

15 న రథోత్సవం

స్వస్తివాచనంతో మొదలైన పాతగుట్ట బ్రహ్మోత్సవాలు.. 17 న నిర్వహించే శతఘటాభిషేకంతో ముగియనున్నాయి. 13 న స్వామివారి ఎదుర్కోలు, 14 న తిరుకల్యాణం, 15న రథోత్సవం వైభవంగా జరగనున్నాయి. భక్తులంతా పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్యాశీస్సులు పొందాలని ఈవో గీతారెడ్డి ఆకాంక్షించారు.

ఇవీ చదవండి: Heli Taxi At Medaram: మేడారం జాతరకు హెలికాప్టర్​లో వెళ్లొచ్చు!​

Medaram Jatara: భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలి: సీఎస్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.