Yadadri Temple News : యాదాద్రిలో నాలుగో రోజు ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాలు వైభవంగా సాగుతున్నాయి. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా పంచకుండాత్మక మహాయాగం నిర్వహిస్తున్నారు. బాలాలయంలో శాంతి పాఠం, చతుఃస్థానార్చన, మూలమంత్ర హవనం చేపట్టారు. ప్రధానాలయంలో పంచవింశతి కలశ స్నపనం, నిత్యలఘు పూర్ణాహుతి చేశారు. సాయంత్రం ప్రతిష్ఠామూర్తులకు జలాధి వాసం నిర్వహించటంతో పాటు విష్ణు సహస్రనామ పారాయణం, నిత్య లఘు పూర్ణాహుతి, యాగశాలలో మూలమంత్ర హవనములు జరగనున్నాయి.
ప్రతిష్ఠామూర్తుల శోభాయాత్ర..
Mahakumbha Samprokshana at Yadadri : పంచకుండాత్మక మహాయాగం ముగిశాక, మహాకుంభ సంప్రోక్షణ పర్వం నిర్వహించే సోమవారం నాడు కొండపైన బాలాలయం నుంచి ప్రధానాలయం వరకు ప్రతిష్ఠామూర్తుల శోభాయాత్ర ఉంటుందని ఆలయ ఈవో గీత, ప్రధాన పూజారి లక్ష్మీనరసింహాచార్య తెలిపారు. ఆ రోజు ఉ. 11.55 గంటలకు స్వయంభువు మినహా ప్రతిష్ఠామూర్తులు, కలశాలకు ఏకకాలంలో మహాకుంభ సంప్రోక్షణ నిర్వహిస్తామని వివరించారు. కొండ కింద ఉత్తర దిశలో నిర్మితమైన పైవంతెనను 26న ప్రారంభించనున్నారు.
లక్ష్మి పుష్కరిణి సిద్ధం
Panchakundathmaka Yagam at Yadadri : గండి చెరువు వద్ద నిర్మించిన లక్ష్మి పుష్కరిణిని నీటితో నింపి సిద్ధం చేశారు. గోదావరి జలాలతో పుష్కరిణిని నింపాలని ప్రణాళిక రూపొందించినా ట్యాంకుల నిర్మాణం పూర్తికాకపోవడంతో ప్రస్తుతానికి బోరు నీటితో నింపారు.
- ఇదీ చదవండి : తపించారు.. ముందడుగేశారు.. సాధించారు