ETV Bharat / state

పెండింగ్​ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం : పల్లా రాజేశ్వర్​ రెడ్డి - ఎమ్మెల్సీ ఎన్నికలు

మిషన్​ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందించిన ఘనత కేవలం కేసీఆర్​కే దక్కుతుందని శాసనమండలి విప్​ పల్లా రాజేశ్వర్​ రెడ్డి కొనియాడారు. అతి త్వరలోనే పెండింగ్​లో ఉన్న ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తామని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లో కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Palla Rajeshwar Reddy Participated In Cadre Meeting in Chowtuppal
పెండింగ్​ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం : పల్లా రాజేశ్వర్​ రెడ్డి
author img

By

Published : Sep 21, 2020, 7:57 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో శాసనమండలి విప్​ పల్లా రాజేశ్వర్​ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మిషన్​ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్​కే దక్కుతుందని, పెండింగ్​లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చౌటుప్పల్​లో కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేసారు. రాష్ట్రంలో పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందరికీ అందజేస్తున్నామని ఆయన తెలిపారు.

ఇదీ చూడండి : సరూర్‌నగర్ నాలాలో గల్లంతైన నవీన్‌ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.