ETV Bharat / state

పొంగుతోన్న చిన్న ఏటి వాగు.. రాకపోకలకు అంతరాయం

author img

By

Published : Sep 18, 2020, 11:43 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల పరిధిలోని చిన్న ఏటి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాత్రి నుంచి వాగుపై ఉన్న లో లెవెల్ బ్రిడ్జి (కల్వర్ట్ ) మీదుగా నీరు ప్రవహిస్తోంది. ఫలితంగా ఆయా పరిసర గ్రామ ప్రజలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తమ ఇబ్బందులను చూసైనా గొల్లగూడెం - ముగ్దుమ్​పల్లి గ్రామాల మధ్య పెద్ద బ్రిడ్జి వంతెనను త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

పొంగుతోన్న చిన్న ఏటి వాగు.. రాకపోకలకు అంతరాయం
పొంగుతోన్న చిన్న ఏటి వాగు.. రాకపోకలకు అంతరాయం

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గొల్లగూడెం - ముగ్దుమ్ పల్లి గ్రామాల మధ్య ఉన్న చిన్న ఏటి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాత్రి నుంచి వాగుపై ఉన్న లో లెవెల్ బ్రిడ్జి (కల్వర్ట్ ) మీదుగా నీరు ప్రవహిస్తుండటంతో ఆయా పరిసర గ్రామ ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. వాగు పరిసర తండా గ్రామాలు, గుర్రాల దండి, బట్టుగూడెం, పెద్ద రావులపల్లి, పోచంపల్లి గ్రామాలకు చెందిన వారు జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే, ఈ చిన్న ఏటి వాగు దాటిరావాల్సి ఉంటుంది.

పొంగినప్పుడల్లా అంతరాయమే..

గ్రామాలకు వెళ్లేందుకు ఇదే దగ్గరి దారి కాగా, చిన్న ఏటి వాగు పొంగినప్పుడల్లా పరిసర గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. ఈ ఇబ్బందులను తొలగించడానికి లో లెవల్ బ్రిడ్జి పక్కనే పెద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టి దాదాపు నాలుగేళ్లు అవుతున్నా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

రాత్రి వేళల్లో ఇబ్బంది తీవ్రతరం..

ముఖ్యంగా రాత్రి వేళల్లో 108 వాహనం గానీ, వైద్యం కోసం అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చినప్పుడు సమస్య మరింత ఇబ్బంది పడాల్సి వస్తుందని వాపోతున్నారు. ఫలితంగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గొల్లగూడెం - ముగ్దుమ్ పల్లి గ్రామాల మధ్య పెద్ద బ్రిడ్జి వంతెనను త్వరగా పూర్తి చేయాలని పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చూడండి : నిరాడంబరంగా బతుకమ్మ ఆట.. కరోనాతో తగ్గిన సందడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.