ETV Bharat / state

'నేను అనాథనే... నాలా ఎవరూ కష్టాలు పడకూడదు' - అనాథలకు సాయం చేస్తున్న అనాథ వార్తలు

అనాథలకు ఆసరాగా నేనున్నానంటూ మరో అనాథ సాయం చేస్తున్నాడు. సాయం కోసం ఎదురు చూస్తున్న వారికి అండగా తోడుంటున్నాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడం వల్ల ఎన్నో కష్టాలు పడ్డానని... అందుకే తన లాగా మరెవరూ బాధపడకూడదనే అభిప్రాయంతో సేవాకార్యక్రమాలు చేస్తున్నానని తెలిపాడు. ఆ యువకుడు ఎవరంటే..?

orphan-helps-to-people-in-yadadri-district
'నేను అనాథనే... నాలా ఎవరూ కష్టాలు పడకూడదు'
author img

By

Published : Aug 27, 2020, 1:25 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామానికి చెందిన కురిమేటి నవీన్ చిన్నవయసులనే తల్లిదండ్రులను కోల్పోయాడు. ఎన్నో కష్టాలను అధిగమించి హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్ననాటి నుంచి నా అనే వారు లేక పడిన కష్టాలు... మరెవరికి రాకూడదనే ఉద్దేశంతో తనలాంటి అనాథలకు సాయం చేయాలనుకునేవాడు. మరో నలుగురు మిత్రుల(కురిమేటి నరేందర్​, నల్ల నవీన్, సూరారం వంశీ, కురిమేటి గోవర్దన్)తో కలిసి మాతృదేవోభవ, పితృదేవోభవ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. అప్పటి నుంచి సామాజిక కార్యక్రమాలు చేపడుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

హైదరాబాద్​లో పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 100 మంది అనాథలకు నోటు పుస్తకాలు, పెన్స్, స్టడీమెటీరియల్ అందించింది ఈ బృందం. గాంధీ ఆసుపత్రిలోని రోగుల బంధువులకు, రోడ్డు పక్కన ఉండే అనాథ పిల్లలకు, మజ్జిగ ప్యాకెట్లు, ఆహార పొట్లాలు అందిస్తున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే సుమారు మూడువందల మంది అనాథ పిల్లలకు స్టడీమెటీరియల్ అందించారు. యాదాద్రి జిల్లాలో పలు మండలాల్లో ఉచిత ఆ‌రోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి.. వైద్యం చేయించుకోలేని సుమారు వంద మంది నిరుపేదలకు సొంత ఖర్చులతో వైద్యం చేయించారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదాతగా నిలిచారు.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సందర్బంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్ ప్రకటించిన వేళ... గ్రామాల్లోని పేదలకు నిత్యావసరాలు అందించారు. ఇప్పటి వరకు తన జీతం డబ్బులు, స్నేహితుల సహకారంతో సేవాకార్యక్రమాలు చేశానని... దాతలు ఎవరైనా సహకరిస్తే భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తానని వెల్లడించారు.

ఇదీ చూడండి: కృష్ణా బేసిన్‌లో నిండు కుండల్లా జలాశయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.