యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి రైల్వే స్టేషన్లో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రైలు కింద పడడం వల్ల తలకి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కి తరలించారు. యువకుడు భువనగిరి పట్టణంలోని హుస్సేనబాద్ చెందిన వంశీ యాదవ్‌గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది.
ఇవీ చూడండి: విత్తనంపై గుత్తాధిపత్యం వద్దు.. కొత్త చట్టం కావాలి!