యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌లో దారుణ హత్యకు గురైన ముగ్గురు చిన్నారుల్లో ఒకరైనా శ్రావణి తండ్రి పాముల నర్సింహా గ్రామస్థులకు కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. సుమారు 300 కుటుంబాకు సరకులు అందజేశారు. మర్రి శ్రీనివాస్ రెడ్డి చేతిలో శ్రావణి.. పాశవికంగా హత్యకు గురై నేటికి సంవత్సరం కావడం వల్ల చిన్నారి జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భవనగిరి ఏసీపీ భుజంగరావు హాజరయ్యారు. మర్రి శ్రీనివాస్ రెడ్డికి త్వరలోనే శిక్ష అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు కరోనా వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరారు. అందరూ స్వీయ నిర్బంధాన్ని పాటించాలన్నారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించారు. వాహనాలపై ఒక్కరికి మించి వెళితే కేసులు పెట్టాల్సి వస్తుందని భుజంగరావు హెచ్చరించారు.
ఇదీ చూడండి: నీళ్లు ఎక్కువ తాగితే బరువు తగ్గుతారా?