భువనగిరి జిల్లా మోత్కూర్లో తెలుగు సంవత్సరం ప్రారంభం మధుమాంసాలతో మొదలవుతుంది. సుమారు 80 ఏళ్ల క్రితం గ్రామంలో కలరా, మశూచి వంటి అంటువ్యాధులు ప్రబలి వరుస మరణాలు జరిగేవి. సరైన వైద్యం లేక, నాటు వైద్యం కుదరక ఎంతోమంది చనిపోయారు. ఈ వరుస మరణాలు ఆపేందుకు గ్రామ పెద్దలు నాలుగు దిక్కుల ముత్యాలమ్మ దేవతలకు బోనం పెట్టి శాంతింపజేశారు. మరణాల సంఖ్య తగ్గడం.. గ్రామస్థుల్లో నమ్మకాన్ని పెంచింది. అప్పటి నుంచి ప్రతి ఉగాదిని మాంసాలతో జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
ఎడ్ల బండ్లతో ప్రదర్శన:
గ్రామంలో మహిళలందరూ ఉగాదికి ఒకరోజు ముందు చలి బోనాలను ఏర్పాటు చేస్తారు. ఇవాళ రైతులు ఎడ్ల బండ్లను, వాహనాలను అందంగా అలంకరించి.. అందులో మహిళలు బోనాలతో వచ్చి గ్రామ దేవతకు సమర్పించుకుంటారు. తమ బిడ్డలను చల్లగా చూడాలని కోరుకుంటారు.
అందరు తమ కొత్త అల్లుళ్లను, కోడళ్లను పిలుచుకొని ఆనందంగా జరుపుకుంటారు. ఈ గ్రామంలో పుట్టి పెరిగిన వారు ఎక్కడ ఉన్నా ఉగాది రోజు తప్పకుండా వచ్చి అందరితో ఆనందంగా వేడుకల్లో పాల్గొంటారు.
ఇవీ చూడండి: 'ఉగాది మార్పు... రాష్ట్రం నుంచే మొదలవ్వాలి'