ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎలక్షన్ల నామినేషన్ పర్వం మొదలైంది. చౌటుప్పల్, మోత్కూరు, నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లో మున్సిపల్ కార్యాలయాలు కోలాహలంగా మారింది. నామినేషన్లు వేయడానికి భారీ సంఖ్యలో వివిధ పార్టీల నుంచి తరలివచ్చిన అభ్యర్థులతో మున్సిపల్ కార్యాలయాలు కిక్కిరిశాయి.
చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 20 వార్డులకు గాను నామినేషన్లు స్వీకరించారు. ఎన్నికల ప్రత్యేక అధికారి సురేశ్ కుమార్ పర్యవేక్షణలో ఎన్నికల సిబ్బంది.. నామినేషన్లకు వస్తున్న అభ్యర్థులకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి వారికి నామినేషన్ల ఫారం గురించి క్లుప్తంగా వివరిస్తున్నారు. మోత్కూరు పరిధిలోని 12 వార్డులకు గాను బుధవారం రోజు వరకు 7 నామినేషన్లు దాఖలయ్యాయి.
నాగార్జున సాగర్ నియోజకవర్గం పరిధిలోని నందికొండ, హాలియా రెండు పురపాలికల్లో నామినేషన్ల పర్వం సాదాసీదాగా జరిగింది. నందికొండలోని 12 వార్డులకు గాను తొలిరోజు 5 నామినేషన్లు దాఖలయ్యాయి. హాలియా మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డులు ఉండగా మొత్తం 17 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఇదీ చూడండి : 'ఎన్నికల్లో ధన ప్రవాహం విచ్చలవిడిగా పెరిగింది'