యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరుకు చెందిన సిరిబోయిన నర్సింగ్ యాదవ్కు చెందిన నాలుగు ఎకరాల కంది పంట దగ్ధమైంది. ఐదు ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద కౌలుకు తీసుకున్నాడు. నాలుగు ఎకరాలు కంది పంట వేయగా ఒక ఎకరం ఖాళీగా ఉండేది. తన పక్కన ఉన్న రైతు పొలంలో గడ్డిని తగలబెడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దాంతో పక్కనే ఉన్న తన కంది పంట, కొంతమేర పత్తి పంట, 16 టేకుచెట్లు మంటల్లో కాలిపోయాయి.
నిర్లక్ష్యంగా వ్యవహరించారని అడుగగా ఎక్కడైనా ఫిర్యాదు చేసుకుంటావో చేసుకోపో అంటూ కాల్చిన రైతు భార్య అన్నదని ఆయన వెల్లడించారు. మరో వారంలో పంట కోయనుండగా ఈ ఘటన జరగడంతో అన్నదాత కన్నీరుమున్నీరయ్యారు. పెట్టిన పెట్టుబడిలో ఒక రూపాయి రాకుండా పోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పెద్దలు కాలిపోయిన పంట పొలాన్ని సందర్శించారు.
ఇదీ చూడండి : పెళ్లింట్లో విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు దుర్మరణం