యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఎన్సీడీసీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ బృందం సందర్శించింది. సహకార సంఘం కార్యకలాపాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించనున్న వినియోగదారుల స్టోర్, 500 మెట్రిక్ టన్నుల గోదాం, పప్పు మిల్లు ప్రతిపాదనను పరిశీలించారు.
నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వీటి నిర్మాణానికి కావలసిన నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. సహకార సంఘాల అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.