ETV Bharat / state

'అభివృద్ధిలో అందరికి ఆదర్శంగా నిలుస్తాం'

పల్లెల అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమవుతుందన్న మహనీయుల కల నిజం చేసేందుకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని గ్రామాలన్నీ నడుం బిగించాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 30 రోజుల కార్యచరణ ప్రణాళికను విజయవంతంగా అమలు చేసి తమ ఊళ్లను ఆదర్శంగా తీర్చిదిద్దుకున్నాయి.

ఆదర్శ గ్రామం
author img

By

Published : Oct 4, 2019, 3:17 PM IST

ఆదర్శ గ్రామం

పల్లెలు ప్రగతి పథంలో దూసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​ 30 రోజుల కార్యచరణ ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో బొమ్మలరామారం మండలంలోని మైసిరెడ్డిపల్లి గ్రామాన్ని మోడల్​ విలేజ్​గా రూపొందించేందుకు అధికారులు ఎంపిక చేశారు. యాదాద్రి జిల్లాలో గతేడాది ప్రత్యేక పంచాయతీగా ఏర్పడిన మైసిరెడ్డిపల్లి గ్రామం 30 రోజుల ప్రణాళికలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. 80 శాతం పారిశుద్ధ్య పనులు పూర్తిచేసింది.

కలిసికట్టుగా కృషి

ఈ కార్యక్రమంలో భాగంగా... గ్రామస్థులంతా కలిసి స్వచ్ఛందంగా శిథిలావస్థలో ఉన్న ఇళ్లను తొలగించారు. పాత విద్యుత్​ స్తంభాలు తొలగించి కొత్తవి ఏర్పాటు చేశారు. చెత్తాచెదారాన్ని తొలగించి వీధులను పరిశుభ్రంగా మార్చారు. హరితహారంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. గ్రామసభలు ఏర్పాటు చేసుకుని ప్రణాళిక ప్రకారం ఊరంతా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. తమ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు.

అభివృద్ధిలో ఆదర్శమవుతాం

గ్రామ పరిసరాల్లో 10 గుంటల భూమిని డంపింగ్ యాడ్ కొరకు వినియోగిస్తున్నారు. భూగర్భ జలాల స్థాయి పెంచేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్నారు. మురికి కాల్వలు తొలగించి అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణ పనుల ప్రణాళిక రూపొందించారు. వీధుల్లో మిగిలి ఉన్న సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు సర్పంచ్ రమాదేవి తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటివరకు గ్రామంలో 80 శాతం పారిశుద్ధ్య పనులు పూర్తి చేసి పలు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నామని వెల్లడించారు. మోడల్ విలేజ్​గా తీర్చిదిద్దేందుకు ఎంపిక చేసిన తమ గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుస్తామని పేర్కొన్నారు.

మండలంలోనే అగ్రస్థానం

30 రోజుల కార్యచరణ ప్రణాళిక అమల్లో ముందంజలో సాగుతున్న తాము.. దసరా పండుగ నాటికి తమ గ్రామాన్ని మరింత అందంగా ముస్తాబు చేస్తామని తెలిపారు. అభివృద్ధిలో మండలంలోనే అగ్రస్థానంలో నిలిచి అందరికీ ఆదర్శప్రాయమవుతామని మైసిరెడ్డిపల్లి గ్రామస్థులు చెబుతున్నారు.

Intro:Tg_nlg_185_03_aadharsham_aa_gramam_pkg_TS10134__

యాదాద్రి భువనగిరి..
సెంటర్..యాదగిరిగుట్ట..
రిపోర్టర్.. చంద్రశేఖర్. ఆలేరు సెగ్మెంట్.9177863630

వాయిస్.. ఆదర్శం...... ఆ గ్రామం మైసిరెడ్డిపల్లి....

యాదాద్రి భువనగిరి బొమ్మలరామారం మండలం లోని మైసి రెడ్డి పల్లి గ్రామం
కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీలు ఉద్యమస్ఫూర్తితో గ్రామాభివృద్ధి 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యాచరణలో పలు గ్రామాలు ఆదర్శంగా నిలుస్తూ పురోగతి సాధిస్తున్నమైసి రెడ్డిపల్లి పరిశుభ్రంగా వీధులు పచ్చదనంతో నిండిన చెట్లతో ఆహ్లాదకరంగా మారిన గ్రామ పరిసరాలు గ్రామస్తుల సహకారంతో జోరుగా పారిశుద్ధ్య పనులు గ్రామసభల ద్వారా పకడ్బందీగా ప్రణాళిక అమలు మోడల్ విలేజ్ తీర్చిదిద్దడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించిన సర్పంచ్ ,గ్రామస్తులు..

గ్రామాల అభివృద్ధి ద్వారానే దేశ ప్రగతి సాధ్యమవుతుందని మహానీయుల కలలను నిజం చేసేందుకు , మండలంలోని గ్రామాలన్నీ 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తూ అభివృద్ధి పథంలో దూసుకు వెళుతున్నాయి గ్రామాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్ది ఆదర్శ గ్రామంగా రూపొందించాలని లక్ష్యంతో మండలంలోని మహేష్ రెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ గ్రామస్తులు కలిసి పక్కా ప్రణాళిక కార్యాచరణ అమలు గ్రామంలో పలు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రామ పంచాయతీగా మైసిరెడ్డిపల్లిగ్రామం, ఏర్పాటయింది గతంలో హాజీపూర్ మధిర గ్రామంగా ఉండేది కానీ నేడు సీఎం కేసీఆర్ ఏర్పాటుచేసిన గ్రామ పంచాయతీల ఏర్పాటు లో భాగంగా మల్యాల గ్రామం పంచాయతీ గ్రామమైన ధర్మారెడ్డి గూడెం కొత్త గ్రామ పంచాయతీగా మైసిరెడ్డిపల్లి ఆవిర్భవించింది దీంతో ఎన్నో ఏళ్లుగా మధిర గ్రామం గా కొనసాగే నేడు కొత్త (జి పి గా) ఏర్పాటు కావడంతో పలు అభివృద్ధి పనులు కొనసాగుతుండడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు నేడు కొత్త జిపి గా ఏర్పాటు కావడంతో పలు అభివృద్ధి పనులు కొనసాగుతుండడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారూ
గ్రామాలను ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం కెసిఆర్ చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు రూపొందించడంతో గ్రామం రూపురేఖలు మారిపోతున్నాయి అపరిశుభ్ర పరిసరాలు వీధులు మురికి కాలువలు పరిసరాలు కలుపు మొక్కల తో ఉన్న గ్రామం నేడు ఎంతో పరిశుభ్రంగా వాతావరణంలో దర్శనమిస్తుంది వీధులను పరిశుభ్రంగా మారిపోయాయి చెత్తాచెదారాన్ని తొలగించి ఇళ్ల ప్రక్కన ఉన్న కలుపుమొక్కలను తొలగించేందుకు ప్రజాప్రతినిధులు అధికారుల సహాయంతో గ్రామస్తులు గ్రామ సభలను ఏర్పాటు చేసుకొని అభివృద్ధి పనులు గుర్తించి ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారు చిన్న గ్రామం అయినప్పటికీ చింత ,వేప, కానుగ, మామిడి చెట్ల తో గ్రామ రహదారులు పచ్చని శోభను కనబరుస్తున్నాయి మై సి రెడ్డి పల్లి మధిర గ్రామం ధర్మారెడ్డి గూడెం తో కలిపి మొత్తం 609 మంది జనాభా ఇందులో పురుషులు 314 స్త్రీలు 295 మంది కాగా ఓటర్లు 434 మంది ఉన్నారు రెండు గ్రామాలు కలుపుకుని మొత్తం 125 గృహ నివాసాలు ఉన్నాయి తెలంగాణ ఉద్యమంలో కూడా గ్రామస్తులు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు నేడు అదే స్ఫూర్తితో సర్పంచ్ నోముల రమాదేవి రామ్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న పనులు నిర్వహిస్తున్నారు స్వచ్ఛందంగా శిథిలావస్థలో ఉన్న ఇళ్లను తొలగిస్తూ ఉన్నారు గుర్తించి ఇప్పటికే 12 పాత ఇండ్లను గుర్తించి ఐదు ఇళ్లను కూల్చివేశారు వీధుల వెంట కలుపుమొక్కలను తొలగించి శుభ్రం చేశారు చెత్త ఏరివేసి దోమలు వ్యాప్తి చెందకుండా చదువుతున్నారు సముదాయం వద్ద ఏర్పాటు చేసుకున్న పశువులు ,గొర్రెలు, మేకల ,మందలను తొలగించి శుభ్రపరచుకుని అవగాహన కల్పించారు ఈ సందర్భంగా గతంలో గ్రామంలోఇనుప కరెంటు స్తంభాలు ఉండేవి. వాటి స్థానంలో నేడు 12 కొత్త సిమెంట్ విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసుకున్నారు ఇండ్లపై నుంచి వెళ్లే కరెంటు కేబుల్ తీగలను సహకరిస్తున్నారు నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రస్తుత కమ్యూనిటీ భవన్ లో కొనసాగుతుండగా కొత్త భవన నిర్మాణం కోసం శిథిలావస్థలో ఉన్నపాలడైరీ స్థలాన్ని ఎంపిక చేసుకొని ఆ స్థలంలోని పిచ్చిమొక్కలు చెత్తాచెదారం తొలగించి అధికారులు ప్రజా ప్రతినిధులు స్టాండింగ్ కమిటీ సభ్యులతో ప్రతిరోజు గ్రామ అభివృద్ధి పనులు చేపడుతున్నారు రోడ్డుకిరువైపులా మొక్కలు బొమ్మలరామారంటూ కొండమడుగు ప్రధాన రహదారి నుంచి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు హరితహారం లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు అంతేకాకుండా గ్రామంలో ఇంటింటికి ఆరు మొక్కలు పంపిణీ చేసి మొక్కలను సంరక్షించాలి బాధ్యతను ప్రజలకు తెలియజేస్తున్నారు గ్రామంలో ప్రధాన వీధుల వెంట ఏపుగా పెరిగిన ఏళ్లనాటి చింత, వేప, రావి చెట్లతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్నవి గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఇంటి ఇంటి కి కొబ్బరిచెట్లు కనువిందు చేస్తూ సమీపంలో పూల చెట్లు అలరిస్తున్నాయి గ్రామంలో రాత్రి సమయంలో విద్యుత్ కాంతులతో వెలిగిపోతూ ప్రతి స్తంభానికి ఎల్ఈడీ లైట్లను అమర్చారు దుర్గమ్మ గుడి, హనుమాన్ దేవాలయం, పీర్ల కొట్టం ,బొడ్రాయి, పరిసరాలను పరిశుభ్రంగా చేశారు గ్రామంలో ఏర్పాటుచేసిన నర్సరీలో ద్వారా ఇప్పటి వరకు రెండు వేల పైగా మొక్కలను పంపిణీ చేసినట్లు మరో మూడు వేల పైగా మొక్కలను గ్రామవీధుల్లో నాటుతున్న గ్రామస్తులు పేర్కొన్నారు గ్రామ పరిసరాల్లో 10 గుంటల భూమిని చెత్త డంపింగ్ యాడ్ కొరకు వినియోగిస్తున్నారు భూగర్భ జలాల స్థాయి పెంచేందుకు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తున్నారు మురికి కాల్వలను తొలగించి అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణం పనులు ప్రణాళిక రూపొందించారు వీధుల్లో మిగిలి ఉన్న సిసి రోడ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు సర్పంచ్ రమాదేవి తెలిపారు ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటివరకు గ్రామంలో వరకు 80 శాతం వరకు పారిశుద్ధ్య పనులు పూర్తి చేసి పలు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు మండలంలోని మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దేందుకు ఎంపిక చేసిన తమ గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుస్తుందని అంటున్నారు 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యాచరణ అమలు ముందంజలో సాగుతూ ఆదర్శంగా మైసి రెడ్డి పల్లి గ్రామం మండలం లో అగ్రస్థానంలో రూపుదిద్దుకుంటుంది.

మైసి రెడ్డి, గ్రామ సర్పంచ్ రమాదేవి వివరణ..
గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతాం సీఎం కేసీఆర్ గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు నిర్వహిస్తున్నారు గ్రామ ప్రజల సహకారంతో పనులు పూర్తిచేశాము. శిథిలావస్థలో ఉన్న ఇళ్ళను తొలగించి గ్రామ పరిసరాలను ఆహ్లాదకరంగా మార్చేశాము దసరా పండుగ నాటికి తమ గ్రామాన్ని మరింతగా ముస్తాబు చేసి ఆదర్శ గ్రామం లో తయారు చేస్తాము..

మండల్ లో మోడల్ విలేజ్ రూపొందిస్తాం... గ్రామ ప్రత్యేక అధికారి గీతారెడ్డి..

మండలంలోని రెండు గ్రామాలను మోడల్ విలేజ్ గా రూపొందించేందుకు జిల్లా అధికారులు మైసిరెడ్డిపల్లి గ్రామాలను బండ కాడ పల్లి గ్రామాలను గుర్తించారు రెండు కొత్తగా ఏర్పాటయిన గ్రామపంచాయతీ కావటం వల్ల ఆయా గ్రామాలను అందంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం గ్రామాల్లో జరుగుతున్న 30 రోజుల ప్రణాళిక కార్యాచరణ అమలు కార్యక్రమాలను జిల్లా అధికారులు సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు మైసి రెడ్డిపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం అని దీమా వ్యక్తం చేస్తున్నారు..

బైట్.1..గ్రామస్థుడు..

బైట్..2..గ్రామస్థుడు..

బైట్..3..గ్రామస్థురాలు..మహిళా
బైట్..4...గ్రామస్తురాలు...మహిళ..

Body:Tg_nlg_185_03_aadharsham_aa_gramam_pkg_TS10134__

Conclusion:Tg_nlg_185_03_aadharsham_aa_gramam_pkg_TS10134__
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.