ETV Bharat / state

కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌కు వ్యతిరేకంగా చౌటుప్పల్​లో పోస్టర్లు - రాజ్‌గోపాల్‌ను క్షమించదంటూ చౌటుప్పల్​లో పోస్టర్లు

Posters against Rajagopal Reddy రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన మునుగోడు ఉపఎన్నికల వేళ, నియోజకవర్గంలో ఉపపోరు రోజురోజుకు వేడెక్కుతోంది. ప్రచార ప్రణాళికలు, అభ్యర్థులపై కసరత్తుల్లో పార్టీలు మునిగితేలుతున్న సమయంలో క్షేత్రస్థాయిలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి, MLA పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా చౌటుప్పల్‌లో రాత్రికి రాత్రే వెలిసిన గోడపత్రికలు చర్చనీయంగా మారాయి.

Rajagopal
Rajagopal
author img

By

Published : Aug 13, 2022, 10:45 AM IST

Updated : Aug 13, 2022, 1:59 PM IST

Posters against Rajagopal Reddy: మునుగోడు ప్రాంతం రాజ్‌గోపాల్‌ను క్షమించదంటూ చౌటుప్పల్​లో వెలసిన పోస్టర్లు ఇప్పుడు నియోజకవర్గంలో హాట్​టాపిక్​గా మారాయి. కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయాడంని.. పార్టీ అధినేత్రిని వేధిస్తుంటే ప్రత్యర్థితో బేరసారాలు ఆడాడంటూ.. గుర్తు తెలియని వ్యక్తులు గోడపత్రికలు ముద్రించి పట్టణంలో అతికించారు. రాత్రికి రాత్రే వెలిసిన ఈ పోస్టర్ల గురించి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. ఇతర పార్టీల నేతలే ఇలా పోస్టర్లు వేసి ఉంటారని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు.

మరోవైపు ఈనెల 21న అమిత్ షా సమక్షంలో భారీ సభ ఏర్పాటు చేసి భాజపా తీర్థం పుచ్చుకునేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ మేరకు భాజపా నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రతి 3 గ్రామాలకు ఓ సీనియర్ నేతను ఇంఛార్జ్​గా నియమించి ఉప ఎన్నిక సన్నాహాలు ప్రారంభించారు.

Last Updated : Aug 13, 2022, 1:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.