భువనగిరిలో 35 వార్డులకు ఫలితాలు వెలువడ్డాయి. తెరాస 15 స్థానాల్లో విజయం సాధించింది. 11 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. భాజపా అభ్యర్థులు 7, స్వతంత్రులు 2 స్థానాలు దక్కించుకున్నారు. ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఏ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించలేదు.
యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 12 వార్డులకు గానూ... తెరాస, కాంగ్రెస్, ఇతరులు నాలుగు స్థానాల చొప్పున గెలుచుకున్నాయి. ఇక్కడ భాజపా ఖాతా తెరవలేదు. చౌటుప్పల్లో తెరాస 8, కాంగ్రెస్ 5, భాజపా 3 దక్కించుకోగా... 4 స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు. ఎవరికి స్పష్టమైన ఆధిక్యం రానందున స్వతంత్రులు కీలకం కానున్నారు. 12 స్థానాలున్న ఆలేరు మున్సిపాలిటీలో తెరాస 8 స్థానాలు దక్కించుకొని ఛైర్మన్ ఫీఠాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 1, భాజపా 1, ఇతరులు 2 చోట్ల విజయం సాధించారు.
మోత్కూర్ 11 వార్డులకు గానూ... 6 స్థానాల్లో కారు గుర్తు విజయం సాధించి.. మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 5 వార్డులు గెలుచుకుంది. పోచంపల్లిలో 13 వార్డులు ఉండగా... 9 వార్డులు గెలుచుకొని... మున్సిపాలిటీలో తెరాస పాగా వేసింది. కాంగ్రెస్ కేవలం 2 స్థానాలు మాత్రమే దక్కించుకుంది. భాజపా 1, ఇతరులు 1 చోట విజయం సాధించారు.
భువనగిరి
వార్డు | అభ్యర్థి | పార్టీ |
1 | కుశంగుల ఎల్లమ్మ | తెరాస |
2 | ఎనబోయిన ఆంజనేయులు | తెరాస |
3 | చింతల కృష్టయ్య | తెరాస |
4 | నాయిని అరుణ | తెరాస |
5 | ఆంబోతుల కిరణ్ కుమార్ | తెరాస |
6 | తుమ్మల అనురాధ | స్వసంత్ర |
7 | దిద్దికాడి భగత్ | తెరాస |
8 | పంగరెక్కల స్వామి | తెరాస |
9 | నల్లమస సుమ | భాజపా |
10 | పోత్నక్ ప్రమోద్ | కాంగ్రెస్ |
11 | జిట్టా వేణు గోపాల్ | కాంగ్రెస్ |
12 | ఉదారి లక్ష్మీ | భాజపా |
13 | జనగామ కవిత | భాజపా |
14 | గుండెగళ్ల అంజమ్మ | స్వతంత్ర |
15 | నజియా రెహమాన్ | తెరాస |
16 | కడారి ఉమాదేవి | తెరాస |
17 | చెన్న స్వాతి | తెరాస |
18 | అందే శంకర్ | తెరాస |
19 | వడిషర్ల లక్ష్మీ | కాంగ్రెస్ |
20 | పచ్చల హేమలత | కాంగ్రెస్ |
21 | ఉదయగిరి విజయ్ | భాజపా |
22 | బొర్రా రాకేష్ | భాజపా |
23 | పడిగెల రేణుక | కాంగ్రెస్ |
24 | రత్నపురం బలరాం | భాజపా |
25 | మాయ దశరథ | భాజపా |
26 | ఈరపాక నరసింహ్మ | కాంగ్రెస్ |
27 | నజీమా నశ్రీన్ | కాంగ్రెస్ |
28 | కైరంకొండ వెంకటేష్ | కాంగ్రెస్ |
29 | పొత్తంశెట్టి వెంకటేష్ | కాంగ్రెస్ |
30 | కాజా అజీమోద్దీన్ | తెరాస |
31 | బానోతు వెంకట నర్సింగ్ | తెరాస |
32 | గోమారి సుధాకర్ రెడ్డి | తెరాస |
33 | అవంచిక క్రాంతి | తెరాస |
34 | కోళ్ల దుర్గాభవని | కాంగ్రెస్ |
35 | తంగళ్లపల్లి శ్రీవాణి | కాంగ్రెస్ |
చౌటుప్పల్
వార్డు | అభ్యర్థి | పార్టీ |
1 | కె. లింగస్వామి | తెరాస |
2 | బి. రాజ్యలక్ష్మీ | తెరాస |
3 | బి. మల్లేషం | భాజపా |
4 | ఎ. విజయలక్ష్మీ | తెరాస |
5 | పి. వనజ | కాంగ్రెస్ |
6 | ఎ. నాగరాజు | భాజపా |
7 | కె. మంజుల | కాంగ్రెస్ |
8 | కె. సైదులు | కాంగ్రెస్ |
9 | డి. హిమబిందు | స్వతంత్ర |
10 | బి. అరుణ | తెరాస |
11 | పి. శ్రీధర్ | భాజపా |
12 | టి. శిరీష | తెరాస |
13 | ఎస్.రాజు | తెరాస |
14 | ఎస్. విజయ | కాంగ్రెస్ |
15 | యు. వరమ్మ | కాంగ్రెస్ |
16 | రాజు వెన్రెడ్డి | తెరాస |
17 | జి. లక్ష్మణ్ గౌడ్ | స్వతంత్ర |
18 | కె. శైలజ | స్వతంత్ర |
19 | బి. శ్రీశైలం | స్వతంత్ర |
20 | బి. షరీఫ్ మహ్మద్ | తెరాస |