కొత్త రెవెన్యూ చట్టం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది. వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు వెంటనే స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశాల మేరకు... యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం, మోటకొండూర్ మండలాల్లో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
జిల్లాలో మొత్తం 101 గ్రామాల సంబంధించిన రెవెన్యూ దస్త్రాలు, ఇతర వివరాలను కలెక్టర్ అనితారామచంద్రన్కు పంపనున్నట్లు మండల రెవెన్యూ అధికారులు తెలిపారు. సీఎస్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్లు... సంబంధిత వీఆర్వోల నుంచి రికార్డులు తెప్పించుకునే పనిలో నిమగ్నమయ్యారు.
ఇదీ చూడండి: తెలంగాణలో ఆగిన ఈ స్టాంపుల విక్రయం... రిజిస్ట్రేషన్లకు బ్రేక్