ETV Bharat / state

'ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నాయి'

ప్రజలకు ఆపద వచ్చినప్పుడు ప్రభుత్వానికి సహకరించేదిబోయి.. రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ఆరోపణలు చేయడం సరైంది కాదని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్​ అన్నారు. కరోనాపై పోరాటంలో ప్రతిపక్షాలు కలిసి రావాలని కోరారు. యాదాద్రి జిల్లా మోటకొండూర్ పీహెచ్​సీని ఆయన సందర్శించారు.

MP Badugula Lingaya Yadav
MP Badugula Lingaya Yadav
author img

By

Published : May 30, 2021, 6:02 PM IST

కరోనా సంక్షోభంలో ప్రభుత్వానికి సహకరించకుండా.. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నాయని ఎంపీ బడుగుల లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు​. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆసుపత్రుల్లో పర్యటించి బాధితులకు మనో ధైర్యాన్ని ఇస్తోన్న సీఎం కేసీఆర్​పై.. కాంగ్రెస్, భాజపా నాయకులు తప్పుడు వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లా మోటకొండూర్ పీహెచ్​సీని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతతో కలిసి సందర్శించారు. వైద్య సిబ్బందికి.. ఆక్సిజన్ పరికరాలు, మెడికల్ కిట్లను అందజేశారు.

ముఖ్యమంత్రి.. నిత్యం ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులతో సమావేశమై కరోనా కట్టడికి కృషి చేస్తున్నారని ఎంపీ వివరించారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని.. కరోనాపై పోరాటంలో ప్రతిపక్షాలు కలిసి రావాలని ఆయన కోరారు. కొవిడ్​ కష్ట కాలంలోనూ రైతుల నుంచి ఇప్పటికే 80 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకొనే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ఇదీ చదవండి: 'రుతుపవనాల రాక రెండు రోజులు ఆలస్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.