mountaineer anvitha : యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పర్వతారోహకురాలు అన్వితరెడ్డి రష్యాలోని 5,642 మీటర్ల ఎత్తైనా మౌంట్ ఎల్బ్రూస్ పర్వతంపై భారత పతకాన్ని ఎగరవేశారు. వింటర్ సమయంలో మౌంట్ ఎల్బ్రూస్ను అధిరోహించిన తొలి అమ్మాయిగా రికార్డు సాధించారు. ఇప్పటికే నాలుగు పర్వతాలను అదిరోహించినట్లు ఆమె తెలిపారు.
భవిష్యత్‌లో మరిన్ని ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నట్లు చెప్పారు. మొదటి నుంచి తల్లిదండ్రులు ప్రోత్సాహం ఎంతో ఉందని....ప్రస్తుతం గూడూరు నారాయణ రెడ్డి ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో రష్యాలోని ఎల్బ్రూస్ పర్వతం అధిరోహించినట్లు ఆమె చెప్పారు. పర్వతారోహనం చేసేందుకు కావాల్సిన ఆర్థికం సహాయం అందించిన గూడూరు నారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
guduru narayana reddy foundation : భవిష్యత్‌లో అన్వితరెడ్డి చేసే సాహస క్రీడలకు గూడూరు నారాయణ రెడ్డి ఫౌండేషన్ అండదండలు అందిస్తుందని ఫౌండేషన్ వ్యవస్థాపకులు గూడూరు నారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అన్వితరెడ్డిని గూడూరు నారాయణ రెడ్డి ఫౌండేషన్ ఘనంగా సత్కరించింది.
'గత ఐదేళ్లుగా నేను ఈ రంగంలో ఉన్నాను. ఇప్పటి వరకు నేను నాలుగు పర్వతాలు అధిరోహించాను. గతేడాది జనవరిలో కిలిమంజారో పర్వాతాన్ని అధిరోహించాను. తర్వాతి నెలలో లదాక్‌లోని కడే పర్వతాన్ని అధిరోహించాను. తర్వాత రష్యాలోని ఎత్తైన పర్వతం ఎల్బ్రూస్ పర్వతాన్ని ఎక్కాను. నవంబరు 28న రష్యాకు చేరుకున్నాను.. ఈ నెల 4న ఎల్బ్రూస్ పర్వతారోహణ ప్రారంభించాను. మరుసటి రోజు బేస్ క్యాంపునకు చేరుకున్నాను. అక్కడ 10 మీటర్ల పొడవున్న జాతీయ పతాకాన్ని ఎగురవేశాను. డిసెంబర్7న ఈ సమ్మిట్ పూర్తయింది. శీతాకాలంలో ఈ పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళగా రికార్డు నెలకొల్పాను. నా లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆర్థికంగా సాయపడిన గూడూరు నారాయణ రెడ్డికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రతి రోజు ప్రోత్సహిస్తూ లక్ష్యం చేరుకోవడంలో సాయపడ్డారు.' - అన్వితరెడ్డి, పర్వతారోహకురాలు
'ఒక అమ్మాయి సాహోతేపేతమైన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాబట్టి అన్ని విధాలుగా నార్త్ అమెరికా గాని.. మౌంట్ ఎవరెస్టు గాని ఎక్కడికైనా అడుగు ముందుకేస్తే దానికి మా గూడూరు నారాయణ రెడ్డి ఫౌండేషన్ ద్వారా పూర్తిగా సహాయ సహకారాలు అందించి ఆమెను ఒక మంచి అడ్వంచరెస్ స్పోర్ట్స్ ఉమెన్‌గా తీర్చిదిద్దుతాం'. - గూడూరు నారాయణ రెడ్డి, భాజపా సీనియర్ నేత
ఇదీ చూడండి: కిలిమంజారోని అధిరోహించిన అన్వితకు ఘనంగా సన్మానం