యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు వాగుపై 2.24 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న చెక్‌డ్యామ్‌కు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలేరు మండలంలోని గొలనుకొండలో గల వాగుపై కూడా చెక్‌డ్యామ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వాగులపై చెక్‌డ్యామ్‌లు నిర్మించడం వల్ల భూగర్భజలాలు పెరుగుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, జడ్పీటీసీ తోటకూరి అనురాధ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఐటీ కట్టకుండానే వందల కోట్లు దేశం దాటించారు..