కొవిడ్ సంక్షోభంలో.. సేవలందించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం హర్షణీయమని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. స్థానిక జైన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.. కరోనా చికిత్సలో అత్యవసరమైన యంత్ర సామాగ్రిని ఆలేరు ప్రభుత్వాసుపత్రికి అందజేశారు.
దాతలెవరైన ముందుకు వచ్చి ఆసుపత్రికి మరింత తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రస్తుతం మూడు ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్లను ఇచ్చామన్న సంస్థ ప్రతినిధులు.. రానున్న రోజుల్లో మరిన్ని ఆక్సిజన్ సిలిండర్లు, ఫ్లో-మీటర్లను అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీహెచ్సీ సీఎంవో డా. క్రాంతి, పుర ఛైర్మన్ శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Aicc: 'భాజపా ఏడేళ్ల పాలనలో ధరలే పెరిగాయి'