కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి, కొవిడ్ బారిన పడకుండా జాగ్రత్త వహించాలని... యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత అన్నారు. వైరస్ లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. 45 సంవత్సరాలు నిండిన వారందరూ ఎటువంటి అపోహలు లేకుండా టీకా వేయించుకోవాలని తెలిపారు.
కొవిడ్ విషయంలో మన అజాగ్రత్త వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నారు. జాగ్రత్తలు తీసుకుంటూ వైరస్ వ్యాప్తి నివారణకు సహకరించాలని తెలిపారు. ఎటువంటి పరిస్థితిలోనైనా మాస్క్ ధరించకుండా బయట తిరగకూడదని సూచించారు. అందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కరోనాతో మాజీ మంత్రి చందూలాల్ కన్నుమూత