ETV Bharat / state

ఒక్క సీసీ కెమెరా నలభై మంది పోలీసులతో సమానం : గొంగిడి సునీత

author img

By

Published : Feb 7, 2021, 10:36 PM IST

Updated : Feb 8, 2021, 6:37 PM IST

గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడొచ్చని ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదరిగిగుట్ట మండలం రామాజీపేటలో సీసీ కెమెరాలను ఆమె ప్రారంభించారు.

mla gongidi sunitha inaugauration of cc cameras in ramojipeta villagae in yadadri bhuvabnagiri district
సీసీ కెమెరాల ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్​ గొంగిడి సునీత

భద్రతతో పాటు మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరగకుండా సీసీ కెమెరాలు ఉపయోగపడుతాయని ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. ఒక్కో సీసీ కెమెరా 40 మంది కానిస్టేబుళ్లతో సమానమని ఆమె తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం రామాజీపేటపేట, అహమ్మద్​ నగర్​లో సీసీ కెమెరాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.

గ్రామంలో ప్రతి ఇంటి ముందు ఖాళీస్థలంలో మొక్కలు నాటి హరితహారం పెంపొందించాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, దొంగతనాలు జరిగినా సీసీ కెమెరాలతో వెంటనే గుర్తించటం సులువవుతుందని తెలిపారు. గ్రామాభివృద్ధికి అవసరమైన పనులన్నీంటిని నెరవేరుస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి, సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : ఉద్యోగులపై పని భారం తగ్గించాలి: అశ్వత్థామ రెడ్డి

Last Updated : Feb 8, 2021, 6:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.