యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు, అడ్డగుడూరు, నల్గొండ జిల్లా శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ సందర్శించారు. కరోనా చికిత్స విషయంలో ప్రభుత్వ ఆసుపత్రుల వసతులపై ఆరా తీశారు. ఆసుపత్రిలో మౌలిక వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కరోనా పరీక్షలు రోజుకు 50 వరకు చేస్తున్నారని.. అవసరాన్ని బట్టి వంద వరకు పెంచే ప్రయత్నం చేయాలని అన్నారు.
కరోనా పరీక్షలు, వాక్సినేషన్ ఒకే స్థలంలో ఉండటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుందని.. ప్రజలకు సౌకర్యార్థం కరోనా పరీక్షలు పక్కనే ఉన్న విశ్రాంతి భవనంలో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పాజిటివ్ వచ్చిన వారికి వెంటనే కరోనా కిట్టు అందించాలని సూచించారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న వారిని భువనగిరికి లేదా.. హైదరాబాద్‌కు తరలించి వైద్యం అందించాలని వెల్లడించారు.
ఇదీ చదవండి: అధికారం శాశ్వతమనుకుంటే భ్రమలో ఉన్నట్లే : ఈటల