యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నిర్మాణం ఒక చరిత్ర అని.. ఆ ఘనత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకే దక్కుతుందని భూపాల్ రెడ్డి అన్నారు. ఆ కాలంలో రాజులు దేవాలయాలు నిర్మిస్తే.. ఈ కాలంలో కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించి చరిత్ర లిఖిస్తున్నారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
ఎవరూ ఊహించని విధంగా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం జరుగుతోందన్నారు. ఇప్పటికే ప్రసిద్ధి గాంచిన యాదాద్రి ఆలయాన్ని రానున్న రోజుల్లో లక్షల మంది దర్శించుకుని తరించనున్నారని అన్నారు. హైదరాబాద్ నగరానికి యాదాద్రి దగ్గరగా ఉండటం వల్ల తొందరగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు.
ఇదీ చూడండి:- 'కరోనా వేళ ఎన్నికల నిర్వహణకు సూచనలు ఇవ్వండి'