యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులోని టీచర్స్ కాలనీకి వెళ్లే అండర్ పాస్ బ్రిడ్జి వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి మంచి నీరు వృథాగా పోతోంది. నీటి ఉధృతికి అటుగా వెళ్తున్న వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వారం క్రితమే ఇదే మార్గంలో మిషన్ భగీరథ పైప్లైన్ రాత్రి వేళలో పగిలి నీరు వృథాగా పోయింది.
ఇవాళ మధ్యాహ్నం నీరు ఉవ్వెత్తున పైకి లేచి చిమ్ముతూ ఫౌంటైన్ను తలపించింది. అటుగా వెళ్తున్న వారు చరవాణిలో ఆ దృశ్యాలను బంధించడానికి ప్రయత్నించారు.
ఇదీ చూడండి: దొంగ మద్యం ఏరులైపారుతోంది: ఎంపీ