సర్దార్ పాపన్న ఓరుగల్లు, భువనగిరి, గోల్కొండ కోటలను జయించి కుల వృత్తులందరూ స్వతంత్రంగా జీవించేందుకు మార్గదర్శకాలు చేశారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరిజిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తాటి, ఈత మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గ్రామపంచాయతీ భవనంలో సీసీ కెమెరాలను ప్రారంభించారు.
పల్లె ప్రకృతి వనాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల్సిందిగా అధికారులకు మంత్రి సూచించారు. బడుగు బలహీన వర్గాల కోసం సర్వాయి పాపన్న పోరాడారని గుర్తు చేశారు. భువనగిరి కోట వద్ద పాపన్న విగ్రహానికి పూలమాల వేసి సత్కరించారు. కోటను పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక గీత కార్మికులకు, గౌడ కులస్థులకు ఎన్నో విధాలుగా ప్రోత్సాహం ఇచ్చిందన్నారు.
సమావేశంలో భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఫీర్జాదిగూడ కార్పొరేటర్ పోచయ్య, సర్పంచ్ సురేష్, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మరికొన్ని గంటల్లో తేలిపోనున్న దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం