ETV Bharat / state

'12 మంది వైరస్ బాధితులు... వలసకూలీలే'

మహారాష్ట్ర నుంచి యాదాద్రికి తిరిగొచ్చిన వలసకూలీల్లో మరో 12 మందికి కరోనా వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వారు జిల్లాలో ప్రవేశించకున్నా... అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.

migrant-workers-tested-corona-positive-at-yadadri
'12 మంది వైరస్ బాధితులు... వలసకూలీలే'
author img

By

Published : May 13, 2020, 10:44 AM IST

మహారాష్ట్రకు వలస వెళ్లి యాదాద్రి భువనగిరి జిల్లాకు తిరిగివచ్చిన వారిలో... మరో 12 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. అయితే వీటన్నింటినీ యాదాద్రిలో కాకుండా... వలస కూలీల జాబితాలో చేర్చారు. ఆత్మకూరు ఎమ్ మండలంలో ఐదుగురు, చౌటుప్పల్ పురపాలిక పరిధిలో నలుగురు, సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన ఇద్దరు, మోటకొండూరు మండల కేంద్రంలో ఒకరు వైరస్ బారిన పడ్డారు.

ఇందులో ఆత్మకూరు, మోటకొండూరుకు చెందిన వారు మినహా మిగతా వారెవరూ జిల్లాలోకి ప్రవేశించకున్నా... ఆయా ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. మోటకొండూరు పాజిటివ్ బాధితురాలు... ఆమె భర్త, ఇద్దరు పిల్లలతో ఈ నెల 9న రాత్రి నాందేడ్ నుంచి వచ్చారు. ఆ నలుగురితో పాటు మరో ముగ్గుర్ని ఈ నెల 10న ఉదయమే క్వారంటైన్‌కు తరలించారు. పరీక్షల్లో ఆమె ఒక్కరికే పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో... నిన్న మరో 13 మందిని బీబీనగర్ ఎయిమ్స్ క్వారంటైన్‌కు పంపించారు. ఆత్మకూరు మండలానికి సంబంధించి ఇప్పటివరకు 13 మందిని హైదరాబాద్‌కు తరలించగా... 8 మందికి పాజిటివ్ వచ్చింది. వారి కాంటాక్టులకు సంబంధించి... ఇంకో 36 మందిని హోం క్వారంటైన్‌కు ఆదేశించారు.

ఇవీ చూడండి: కొవిడ్‌తో 'ఆట'లా..జాగ్రత్త సుమా !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.