సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు సవాల్‌గా స్వీకరించాలని భువనగిరి శాసనసభ్యుడు పైళ్ల శేఖర్‌రెడ్డి కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండల కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్‌లో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పోచంపల్లి మండలంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 ఎంపీటీసీ స్థానాలకు గానూ 9 స్థానాలు గెలుచుకుని సత్తా చాటిందని అదే ఉత్సాహంతో సభ్యత్వ నమోదు విజయవంత చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, స్థానిక నేతలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మళ్లీ నేను పుట్టాలని.. దయచేసి కోరుకోకమ్మా!