ETV Bharat / state

అభివృద్ధికి అందనంత దూరంలో యాదాద్రి అంగడి - market problems

యాదగిరిగుట్టలో గ్రామీణ మార్కెట్‌ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వర్షాలు పడితే సరిపడ షెడ్లులేక, నిత్యం అవస్థలు పడుతూ రైతులు వ్యాపారం చేస్తున్నారు. కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీని వల్ల సామాన్య ప్రజలు కూరగాయలు కొనాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.

అభివృద్ధికి అందనంత దూరంలో యాదాద్రి అంగడి
author img

By

Published : Jul 29, 2019, 11:51 PM IST

ఓ వైపు వేగంగా సాగుతున్న యాదగిరి లక్ష్మీనరహింహస్వామి ఆలయ పనులు... మరోవైపు పట్టణంలో ప్రతి బుధవారం జరిగే అంగడి విషయంలో స్థానికులకు, రైతులకు తప్పని ఇక్కట్లు... రైతులకు, వ్యాపారులకు కనీస వసతులు కూడా లేని పరిస్థితి. మార్కెట్‌ అభివృద్ధి కోసం ఎన్నో ఏళ్ల క్రితం శిలా ఫలకాన్ని ఆవిష్కరించినా.. పనులు మాత్రం మొదలు కాలేదు. 30 ఏళ్ల క్రితం మార్కెట్‌ ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉందంటున్నారు వ్యాపారస్థులు. అంగడికి వచ్చే వారికి తాగునీటి సదూపాయం, శౌచాలయాలు, కూరగాయలు తడిపేందుకు నల్లాల వసతి కూడా లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడితే తలదాచుకోవడానికి సరిపడ షెడ్లు కూడా లేవని వాపోతున్నారు.

కొందామంటే కొనలేని పరిస్థితి....

ఇన్ని రోజులు వర్షాభావ పరిస్థితుల వల్ల కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. కిలో రూ.80 పెట్టినా కొనలేని పరిస్థితిలో సామాన్య ప్రజలు ఉన్నారు. మార్కెట్లో సరైన శౌచాలయాలు లేక జనం అవస్థలు పడుతున్నారు. రైతు బజార్‌ను అన్ని హంగులతో తీర్చిదిద్దేందుకు నిధుల కేటాయింపు జరిగి, శిలాఫలకం ఆవిష్కరించినప్పటికీ... పనులు మాత్రం ప్రారంభం కాలేదని స్థానికులు వాపోతున్నారు.

ఒకవైపు అంగడిలో మురికి కాలువ చుట్టూ పేరుకు పోతున్న చెత్త... మరోవైపు పూర్తిగా రక్షణ లేని ప్రహారీ గోడలతో అసౌకర్యంగా ఉందంటున్నారు వ్యాపారులు. వర్షాలు పడితే రోడ్డు మొత్తం బురదతో నిండిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులేమంటున్నారు...!?

ఇప్పటికే మార్కెట్‌ అభివృద్ధికి నిధులు మంజూరు చేశారని... అవి విడుదల కాగానే పనులు పూర్తి చేస్తామని అధికారులంటున్నారు. వ్యాపారులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని పేర్కొన్నారు.

అభివృద్ధికి అందనంత దూరంలో యాదాద్రి అంగడి

ఇవీ చూడండి: దరువేసిన చిన్నోడు... ఫిదా అయిన పద్మారావ్ గౌడ్‌

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.