రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అసైన్డ్ భూములను పలు కారణాలతో లాక్కుంటున్నారని ఎమ్ఆర్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఎమ్ఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఐదో రోజు చేస్తున్న నిరహార దీక్షలో ఆయన పాల్గొన్నారు.
దళితులకు ఇస్తామన్న మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్లు ఇవ్వకుండా ఉన్న భూములను తీసుకోవడమెంటని ప్రశ్నించారు. పేద ప్రజల కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో దళిత వ్యతిరేక విధానాలను ప్రభుత్వం కొనసాగిస్తుందని ఎద్దేవా చేశారు. అందుకు నిరసనగా దళితుల భూములను కాపాడుకుంటామని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తిరిగి వాళ్ల భూములను వాళ్లకు ఇచ్చేంతవరకు ఈ పోరాటం ఆగదని.. లేనిపక్షంలో పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్ఆర్పీఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : కారు బీభత్సం: ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు