యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని మారుమూల గ్రామం మానాయికుంట. ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు నల్లగొండకి వెళ్లాలంటే మోత్కూరు నుంచి అమ్మనబోలు మీదుగా సుమారు వంద కిలోమీటర్ల పైనే ప్రయాణించాల్సి వచ్చేది.
ఈనాడు కథనాలతో స్పందించి
ఈ ప్రాంత ప్రజల అవస్థలపై 2016లో ఈనాడు దినపత్రిక వరుస కథనాలు ప్రచురించింది. వాటిపై స్పందించిన ప్రభుత్వం 2017లో... 18 కోట్ల వ్యయంతో మూసీ నదిపై మానాయికుంట, గురజాల గ్రామాలను కలుపుతూ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 497.2 మీటర్ల పొడవు, 22 పిల్లర్లతో 18 నెలల కాలపరిమితిలో వంతెన నిర్మాణం పూర్తి చేయాల్సిఉంది... కానీ నేటీకి సగం వరకు పనులు పూర్తికాని పరిస్థితి.
అధికారులేమంటున్నారు
గతేడాది మూసీకి నీరు వదలడం వల్ల వరద ప్రవాహం పెరిగి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుంతం వంతెన పనులు వేగంగా జరుగుతున్నాయి. అత్యాధునిక పద్ధతులైన ఫ్రీకాస్ట్ అనుమతి లభించడం వల్ల పనలు వేగం పుంజుకున్నాయి. జూన్ ఆఖరుకు నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
వంతెన నిర్మాణం త్వరగా పూర్తి చేసి అడ్డగుడూర్, మానాయికుంట, వెల్దేవి, లక్ష్మీదేవి కాల్వ, ధర్మారం, గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.