యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పురపాలక సంఘం నూతన కమిషనర్‌గా మహమూద్ షేక్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు మున్సిపల్ ఇంఛార్జ్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఎంపీడీవో పి.మనోహర్ రెడ్డి.. నూతన కమిషనర్‌కు ఘన స్వాగతం పలికి బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా ఛైర్ పర్సన్ తీపిరెడ్డి సావిత్రి మేఘారెడ్డి, కౌన్సిలర్లు ఆయనకు పూలగుచ్ఛాలతో ఘనస్వాగతం పలికారు.
ఇప్పటి వరకు విధులు నిర్వర్తించిన ఇంఛార్జ్ కమిషనర్‌ను శాలువాలతో సన్మానించారు. విధినిర్వహణలో సహకరించిన పాలకవర్గం, సిబ్బంది, పురపాలక ప్రజలకు మనోహర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మోత్కురు పురపాలక అభివృద్ధికి పాటుపడతానని నూతన కమిషనర్ మహమ్మద్ షేక్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ బొల్లేపల్లి వెంకటయ్య, వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మేనేజర్ శంకర్, బిల్ కలెక్టర్ సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కవిత ఘన విజయం... తెరాస సంబురాలు