లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని రేషన్ షాపుల ద్వారా ప్రజలకు ఒక్కొక్క కుటుంబానికి 12 కిలోల రేషన్ బియ్యం అందించే కార్యక్రమం కొన్ని చోట్ల ఆలస్యంగా మొదలైంది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని కిసాన్ నగర్‌లోని రేషన్ దుకాణం ముందు మధ్యాహ్నం నుంచి ప్రజలు పడిగాపులు పడినా.. రాత్రి 7 తరువాత బియ్యం పంపిణీ మొదలైంది. సమయపాలన లేకుండా రేషన్ డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకుని సమయపాలన పాటించని డీలర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇవీ చూడండి: షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం, తల్లీకుమార్తె సజీవదహనం