యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని పాత గుట్ట చౌరస్తాలోని రెండు మద్యం దుకాణాల్లో దుండుగులు చోరీకి పాల్పడ్డారు. శ్రీతులసి వైన్స్, వీణా మద్యం దుకాణాలలో రాత్రి సమయంలో చోరీ చేశారు. నిన్న రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు షాపులో ఉన్న కొన్ని మద్యం సీసాలు, కొంత నగదు తీసుకుని వెళ్లినట్లు షాపుల యజమానులు పేర్కొన్నారు. ఈ సంఘటన స్థలాన్ని పరిశీలించి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. దొంగతనం జరిగిన ప్రదేశంలో సీసీ ఫుటేజీని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక సీఐ నర్సింగరావు తెలిపారు.
ఇదీ చూడండి : పోలీస్ దొంగయ్యాడు.. అలా దొరికిపోయాడు..