ETV Bharat / state

యాదాద్రి నారసింహుడికి నిత్య ఆరాధనలు.. భక్తుల రద్దీ సాధారణం - యాదాద్రి ఆలయంలో నిత్యఆరాధనలు తాజా వార్త

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. స్వామివారికి ఆదివారం ఆలయ అర్చకులు ఆగమశాస్త్రం ప్రకారం నిత్య ఆరాధనలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులకు విశేష పూజలు, అభిషేకాలు చేశారు.

less crowd for daily rituals in Yadadri temple
యాదాద్రి నారసింహుడికి నిత్య ఆరాధనలు.. భక్తుల రద్దీ సాధారణం
author img

By

Published : Nov 8, 2020, 3:20 PM IST

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో ఆదివారం స్వామి వారికి నిత్య ఆరాధనలు ఆగమశాస్త్ర ప్రకారం అర్చకులు జరిపారు. నిత్య కైంకర్యాలలో భాగంగా వేకువజామునే ఆలయాన్ని తెరిచి స్వామి, అమ్మవార్లకు సుప్రభాత సేవ చేశారు. ప్రతిష్టామూర్తులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులను పంచామృతాలతో అభిషేకించి, అనంతరం తులసీదళాలతో అర్చన జరిపించారు.
ఆలయంలో సుదర్శన నారసింహ హోమం, విశ్వక్సేన ఆరాధన, నిత్యకల్యాణాలు కొనసాగాయి. శ్రీసుదర్శన హోమం నిత్యకల్యాణం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పరిమిత సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో భక్తులరద్దీ సాధారణంగా ఉంది. ఆలయ పరిసరాలు, ఘాట్​రోడ్​లో భక్తుల సందడి తక్కువగానే కనిపించింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఆలయ అధికారులు థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ చేసిన అనంతరం ఆలయంలోకి అనుమతిస్తున్నారు.
భౌతిక దూరం పాటిస్తూ స్వామి వారిని భక్తులు దర్శించుకుంటున్నారు.

ఇదీ చూడండి: యాదాద్రి సన్నిధిలో ఇంజినీర్ చీఫ్​ కుటుంబం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.