యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనుపు కలెక్టర్ రమేశ్, మార్క్‌ఫెడ్ ఎండీ పెండెం సునీత సందర్శించారు. రైతులు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు.
ప్రస్తుతం ఆన్లైన్ జాబితా ప్రకారం రైతుల నుంచి కందులు కొనుగోలు చేస్తున్నామని.. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని అధికారులు వారికి తెలిపారు. ఆన్లైన్ జాబితాతో సంబంధం లేకుండా మార్కెట్‌కు తెచ్చిన ప్రతి రైతు నుంచి కందులను కొంటామని హామీ ఇచ్చారు.
రైతులు పండించిన పంటలను ప్రభుత్వం ఆన్లైన్ జాబితా ఆధారంగా కొంటున్నందున ఇక నుంచి ప్రతి రైతు వ్యవసాయాధికారుల వద్ద సీజన్ వారీగా పంటల వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి అనురాధ కోరారు. జిల్లాలో కందుల దిగుబడి ఎక్కువగా ఉందని, ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు 16 వేల క్వింటాళ్ల కొనుగోలుకే అనుమతించిందని, దాన్ని పెంచాలని తాము ఉన్నతాధికారులకు లేఖ పంపామని మార్క్‌ఫెడ్ డీఎం సునీత తెలిపారు.
ఇవీ చూడండి: మూడు వారాలుగా జలసమాధిలోనే ఎమ్మెల్యే సోదరి కుటుంబం!