ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో నేడు ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామి వారికి లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. బాలాలయ మండపంలోని స్వామి వారి ఉత్సవమూర్తులను వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. ప్రతి మాసంలో శుద్ధ ఏకాదని, బహుళ ఏకాదశి రోజున లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ వేడుకలను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
ఇవీ చూడండి: గచ్చిబౌలి కారు ప్రమాదం.. లైవ్ విజువల్స్